Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

Advertiesment
mithun reddy

ఠాగూర్

, ఆదివారం, 20 జులై 2025 (12:08 IST)
ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఈ అరెస్టును బీజేపీ ఏపీ నేతలు స్వాగతించారు. లిక్కర్ స్కామ్‌లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును బీజేపీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ మండలి సభ్యురాలు సాధినేని యామిని శర్మ అన్నారు.
 
'ఈ చర్య మన ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు శాఖ నిబద్ధతను స్పష్టం చేస్తుంది' అని ఆమె అన్నారు. మిథున్ రెడ్డి దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో భాగమయ్యారని, అక్కడ ఆయన ఎక్సెజ్ విధానాలను తారుమారు చేసి, మద్య ఆటోమేటిక్ ఆర్డర్ ప్లేస్‌మెంట్ వ్యవస్థను మార్చారని యామిని శర్మ ఆరోపించారు. కొంతమంది సరఫరాదారులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే చొరవలను కూడా ఆయన తీసుకున్నారని, షెల్ కంపెనీల ద్వారా నిధులు సమకూర్చారన్నారు. 
 
ఇది రాజకీయ ప్రతీకార కేసు అని వైసీపీ చేసిన ఆరోపణను ఆమె తోసిపుచ్చారు. "వేలాది మంది అమాయక ప్రజల జీవితాలను నాశనం చేసిన మద్యం కుంభకోణంలో భాగమైన వారందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అతి త్వరలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మిగిలిన వ్యక్తులు, చాలా మంది మరణానికి కారణమైన వారు జైలులో ఉంటారు. మేము ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాము" అని ఆమె
తెలిపారు.
 
కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం విజయవాడ సిట్ కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత అరెస్టు చేసింది. కాగా, ఏపీ లిక్కర్ స్కాంలో ఆయన నాలుగో (ఏ4) నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఒక రోజు తర్వాత మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. అంతకుముందు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెల్సిందే. 2019-24లో అమలు చేసిన మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు సిట్ గుర్తించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!