Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో వచ్చి తప్పు చేసాను, నన్ను క్షమించండి

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:03 IST)
భర్త అంటే ప్రేమే. కానీ తరచూ తాగి రావడం ఆ ఇల్లాలికి ఇష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. మనకి పిల్లలు లేరు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. భయంగా ఉంటోంది. నన్ను చూసుకోవాల్సింది నువ్వేగా.. ఇలా నువ్వు తాగి వస్తే ఎలా అని భర్తను ఎన్నోసార్లు ప్రశ్నించింది. కానీ అతనిలో మార్పు రాలేదు. అయితే ఏ అలవాటులేని ఒక డిగ్రీ విద్యార్థికి ఆ మహిళ కనెక్టయ్యింది. అతనితో సహజీవనం మొదలెట్టింది. కానీ చివరకు..

 
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా కెంకెర గ్రామానికి చెందిన దివ్య అనే యువతికి నాథన్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. దివ్యకు 22 యేళ్ళు. నాథన్‌కు 38యేళ్ళు. వయస్సు ఎక్కువగా ఉన్నా తల్లిదండ్రులు వివాహం చేశారు.

 
నాథన్ వైన్ షాప్‌కు ఓనర్. ఆస్తి బాగా ఉండడంతో అతనికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళికి ముందు బాగానే ఉన్నా.. పెళ్ళి తరువాత చెడు స్నేహాలు ఎక్కువై తాగుడు బానిసయ్యాడు నాథన్. దీంతో ప్రతిరోజు తాగి రావడమే పనిగా పెట్టుకున్నాడు. భర్తను ఎన్నో విధాలుగా మార్చాలని చూసింది భార్య.

 
పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఆవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసి ఆటోడ్రైవర్‌గా ఉన్న రాకేష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేత సంబంధానికి దారితీసింది.

 
భర్తతో ఇక ఉండలేనని నిర్ణయించుకుని 20 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ప్రియుడితో వేరే కాపురం పెట్టింది. సహజీవనంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే మూడురోజుల క్రితం దివ్యకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా వదిలేశాడు రాకేష్.

 
దీంతో తాను చేసిన తప్పు ఎలాంటిదో తలుచుకుని కుమిలిపోయింది దివ్య. తన భర్తపై తనకు ఇంకా ప్రేమ ఉందంటూ ఒక లేఖను రాసింది. ప్రియుడితో వచ్చి తప్పు చేసాను, నన్ను క్షమించండి అంటూ ఆ లేఖలో పేర్కొని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments