Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ ఉద్యోగం పిచ్చి, మహిళతో ట్రాప్ చేసిన ఫ్రెండ్, హోటల్ గదికెళ్లిన అతడికి...?

ప్రభుత్వ ఉద్యోగం పిచ్చి, మహిళతో ట్రాప్ చేసిన ఫ్రెండ్, హోటల్ గదికెళ్లిన అతడికి...?
, శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (22:41 IST)
ప్రభుత్వ లెక్చరర్ కావడం అతని లక్ష్యం. అందుకోసం ఏమైనా చేయడానికైనా ఎంత డబ్బు అప్పు చేసి ఇవ్వడానికైనా సిద్థం. అదే అతని జీవితాన్ని నాశనం చేస్తుందనుకోలేదు. నమ్మిన స్నేహితులే నట్టేట ముంచుతారని ఊహించలేకపోయాడు. చివరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి న్యాయం కావాలంటూ లబోదిబోమంటూ ఏడుస్తున్నాడు. 

 
కర్ణాటక రాష్ట్రం సిరిసిలోని ఉంచళ్లిలో రంజిత్, అజిత్‌లు ఒకే గదిలో ఉండేవారు. ఇద్దరు మంచి స్నేహితులు. రంజిత్ ప్రైవేటు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే అతని లక్ష్యం. అజిత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 

 
ఇద్దరూ ఒకే గదిలో ఉండేవారు. జల్సాలకు అలవాటుపడిన అజిత్ వచ్చే జీతాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ అప్పులు చేసేవాడు. అది కాస్త సరిపోక రంజిత్ దగ్గర కూడా చేతులు చాచేవాడు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో అప్పుల వారు హింసించడం మొదలెట్టారు.

 
దీంతో అజిత్‌కు ఒక ఆలోచన వచ్చింది. రంజిత్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఎలాగైనా అతన్ని వలలో వేసుకుందామనుకున్నాడు. అతని నుంచి డబ్బులు లాగేసి అప్పులు తీర్చేద్దామనుకున్నాడు.

 
అందుకు ఒక ప్లాన్ వేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం 15 లక్షల రూపాయల వరకు అవసరం ఉంటుంది. ముందుగా 5 లక్షలు తీసుకుని నేను చెప్పిన ప్రాంతానికి రా అక్కడ కొంతమంది ఉంటారు. వారికి డబ్బులు ఇస్తే చాలు నిన్ను ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చేసేస్తారు.. నువ్వు పరీక్షలు కూడా పెద్దగా రాయాల్సిన అవసరం లేదు.

 
ఎన్ని మార్కులు వచ్చినా నీకు ఉద్యోగం గ్యారంటీ అంటూ నమ్మించాడు. ప్రాణస్నేహితుడు కావడంతో నమ్మి వెళ్ళాడు రంజిత్. అజిత్ బుక్ చేసిన గదిలో ఒక మహిళ ఉంది. కూర్చో రంజిత్ అంటూ తలుపులు మూసింది. ఇంకేముంది మెల్లగా అతడిని రాసలీలల్లో దింపింది. 

 
ఆ తరువాత మొత్తాన్ని ఆమె వీడియోలలో చిత్రీకరించింది. 5 లక్షలు ఇచ్చి వెళ్ళు అంటూ గట్టిగా అరిచింది. ఇది తన ఉద్యోగం కోసం తెచ్చింది అంటూ యువకుడు ఇవ్వలేదు. దీంతో వీడియోలను చూపించడమే కాకుండా అజిత్ కూడా గదిలోకి వచ్చి మర్యాదగా డబ్బులు ఇవ్వాలి. లేకుంటే నీపై కేసులు పెడతాం.

 
ఈమెను రేప్ చేశామని పోలీసు స్టేషన్‌కు వెళతాం.. వీడియోలను చూపిస్తాం.. ఇక నీకు జీవితంలో ఉద్యోగం రాదంటూ భయపెట్టారు. దీంతో 5 లక్షలు సమర్పించుకున్న ఆ యువకుడు గదికి వెళ్ళాడు. వారం రోజుల నుంచి మరో 10 లక్షల రూపాయలు కూడా తీసుకురావాలని స్నేహితుడు బెదిరింపులకు గురిచేశాడు. 

 
దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వెళ్ళిపోయాడు రంజిత్. ఏం జరిగిందో రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన స్నేహితుని నుంచి తనను కాపాడాలని పోలీసులను ప్రాధేయపడుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకటి నుంచి 4వ తరగతి గ్రేడర్ల కోసం మ్యాథ్స్- ఐజిబ్రా డాట్‌ ఏఐ