Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్‌లో విద్యార్థినిని కారులో అత్యాచారం అత్యాచారం

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (14:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో నిత్యంతో ఏదో ఒక ప్రాంతంలో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ విద్యార్థినిపై అత్యాచార జరిగింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై రఘుపతి అనే యువకుడు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు విహారయాత్ర కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య కొందరు విద్యార్థులను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. విహార యాత్ర ముగిసిన తర్వాత తిరిగి అర్థరాత్రి సమయంలో స్కూలుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆ విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు రాలేదు. దీంతో ఆ విద్యార్థిని రఘుపతికి అప్పగించి, ఆమెను ఇంటివద్ద దింపాలంటూ హెచ్ఎం సూచించాడు. 
 
ఇదే అదునుగా భావించిన రఘుపతి.. బాలికను కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రఘుపతిని అరెస్టు చేశారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెడ్మాస్టర్‌ వెంకటయ్యను కూడా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం