Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో దారుణం - భార్యను చంపి సూట్‌కేసులో కుక్కిన టెక్కీ

Webdunia
మంగళవారం, 31 మే 2022 (18:15 IST)
తిరుపతిలో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పక్కా ప్లాన్‌తో హత్య చేసిన కిరాతక భర్త.. శవాన్ని సూట్‌కేసులో కుక్కి చెరువులో పడేశాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు  లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతికి చెందిన వేణుగోపాల్ అనే టెక్కీకి పద్మావతి అనే యువతితో 2009లో వివాహమైంది. ఆ తర్వాత వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో పోలీసులు ఓసారి భార్యాభర్తలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చి పంపించారు. 
 
అయినప్పటికీ వారి మధ్య గొడవలు సద్దుమణగ లేదు. దీంతో పద్మావతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో వేణుగోపాల్ అక్కడకు వెళ్లి భార్యకు నచ్చజెప్పి తనతో పాటు తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పద్మావతిని చంపేసి, శవాన్ని సూట్‌‍కేసులో కుక్కి తిరుపతి శివారు ప్రాంతమైన వెంకటాపురంలో చెరువులో పడేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. పైగా, అత్తమామలను తన భార్య తనతోనే ఉన్నట్టు నమ్మించాడు. 
 
అయితే, గత ఐదు నెలలుగా కుమార్తె నుంచి ఎలాంటి ఫోను రాకపోవడంతో సందేహించిన పద్మావతి తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... వేణుగోపాల్‌ను తిరుపతికి పిలిచి విచారించగా, హత్య చేసినట్టు అంగీకరించాడు. 
 
ఆ తర్వాత నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు చెరువులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పద్మావతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ కుమార్తె కట్టుకున్న భర్త చేతిలోనే దారుణ హత్యకు గురికావడం మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments