Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపాడండి అని కాల్ చేస్తే వచ్చి ఆమెనే హత్య చేసారు, ఎందుకు?

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (13:34 IST)
అమెరికాలో దారుణం జరిగింది. తనను కాపాడమంటూ ఓ బాధితురాలు పోలీసులకు ఫోన్ చేస్తే... తీరా ఆమెను కాపాడాల్సిన పోలీసులే ఆమెను తుపాకీతో కాల్చి చంపేసారు. ఆమె కన్నకూతుళ్లు కళ్ల ముందే ఈ దారుణ ఘటన జరిగింది.
 
పూర్తి వివరాలు చూస్తే... అమెరికాలోని లాస్ ఏంజిలిస్ కౌంటిలోని 27 ఏళ్ల నియాని తన మాజీ బోయ్ ఫ్రెండు వేధింపులకు పాల్పడుతున్నాడనీ, తనను చంపేస్తానంటూ భయపెడుతున్నాడనీ, తనను కాపాడాలంటూ పోలీసులకి ఫోన్ చేసింది. ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే ఆమె నివాసానికి వెళ్లారు. ఐతే ఆమెను కాపాడాల్సిన పోలీసులు బాధితురాలినే తుపాకీతో కాల్చి చంపేసారు.
 
ఇలా ఎందుకు జరిగిందన్న దానికి వారు వివరణ ఇస్తూ... తాము బాధితురాలిని కాపాడేందుకు వెళ్లేసరికి ఆమె చేతిలో పదునైన కత్తి వుంది. ఆ ఆయుధంతో తన మాజీ బోయ్ ఫ్రెండును పొడిచేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. ఆ పని చేయవద్దని తాము ఎంతగా వారించినప్పటికీ ఆమె వినలేదనీ, వేరే మార్గం లేక ఆమెను తుపాకీతో గాయపరచాల్సి వచ్చిందన్నారు. ఐతే ఆమె గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లామనీ, కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు.
 
కాగా దీనిపై బాధితురాలి పెద్దకుమార్తె మాట్లాడుతూ... తన తల్లి అలా కత్తితో బెదిరించలేదనీ, పోలీసులే కాల్చి చంపేసారని ఆరోపించింది. దీనితో బాధితురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలంటూ కోర్టుకు ఎక్కారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments