Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరు సెంట్ల భూమి కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకు.. ఎక్కడ?

Advertiesment
murder
, ఆదివారం, 17 డిశెంబరు 2023 (16:15 IST)
ఆరు సెంట్ల భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రిని కడతేర్చాడు. 50 యేళ్ల వయసులో ఉన్న తండ్రిని అతి కిరాతకంగా చంపేశాడు. కన్నతండ్రిపై క్రూరంగా డీజిల్ పోసి నిప్పు అంటించాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన ఏపీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు సమీపంలోని నాగాయలంక మండలం బవదేరపల్లికి చెందిన హరి మోహన్ అనే వ్యక్తికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశాడు. ఆయన భార్య కొన్ని నెలల క్రితం మంచానపడింది. ఈ క్రమంలో కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీన్ని తండ్రి హరిమోహన్ పలుమార్లు మందలించాడు. దీంతో కసిపెంచుకోవడంతో పాటు తన తండ్రి పేరిట ఉన్న ఆరు సెంట్ల భూమిపై కన్నేశాడు. ఆ భూమి విక్రయించి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండటంతో తండ్రీకుమారుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇదే విషయంపై తండ్రితో గొడవపడిన తలపై బలంగా కొట్టాడు. దీంతో హరిమోహన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. ఆపై ఇంట్లోనే తండ్రి మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగ బయటకు రావడంతో గమనించిన ఇరుగు పొరుగువారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టిన దండగులు...