Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ సర్కారు ఆదేశం

tiger
, మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:02 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఓ పులి అలజడి సృష్టించింది. శనివారం ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. మృతి చెందిన రైతును వయనాడ్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించగా వయసు 36 సంవత్సరాలు. శనివారం పొలంలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లగా, పులి దాడి చేసింది. 
 
ఈ దాడిలో ప్రకాశ్ మృతి చెందిడంతో అతని శరీరంలో సగ భాగాన్ని ఆరగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనపై స్పందించిన స్థానికులు... ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, ఆ పులి మ్యాన్ ఈటర్ అవునా కాదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది. ఆ పులి మ్యాన్ ఈటర్ అని తేలిన తర్వాత దానిని అదుపులోకి తీసుకోలేకపోతే, దానిని చంపేయాలి" అని పేర్కొంది. ప్రస్తుతం దాని జాడ గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ జనవరిలో కూడా వయనాడ్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. అపుడు కూడా పులి దాడి చేసిన ఘటనలో 52 యేళ్ల రైతు ప్రాణాలు కోల్పోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే పట్టాలెక్కనున్న మరో పది వందే భారత్ రైళ్లు