Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను చంపేసిన భర్త... కనిపించలేదంటూ డ్రామా

Advertiesment
murder
, గురువారం, 21 డిశెంబరు 2023 (09:24 IST)
అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపేశాడు. పనివుందని తన వెంట తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీస్ నిఘా నేత్రం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో చోటు చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన రాజేశ్వరి (38)కి అదే జిల్లా రుద్రురు మండల కేంద్రానికి చెంది కార్పెంటర్ రాజేష్‌తో గత 2015లో వివాహమైంది. రాజేష్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగారనికి వచ్చి మియాపూరులో నివాసం ఉంటున్నాడు. రాజేశ్, రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు. పిల్లలు బోధన్‌లో రాజేశ్వరి తల్లి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. 18 యేళ్లపాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో రాజేశ్వరి అడ్డు తొలగించుకోవాలన్న కఠిన నిర్ణయానికి వచ్చిన రాజేశ్... ఈ నెల 10వ తేదీన గండి మైసమ్మ ప్రాంతంలో ఓ ఫంక్షన్‌లో ఉందని బైకుపై తీసుకెళ్లాడు. 
 
బౌరంపేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ ప్రాంతానికి రాజేశ్వరిని తీసుకెళ్లి, అక్కడ ఆమె తలపై రాయితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడేసి ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి వచ్చాడు. ఈ నెల 12వ తేదీన రాజేశ్వరి తల్లి, సోదరికి ఫోన్ చేసి, తన భార్య కనిపించడం లేదంటూ డ్రామా మొదలుపెట్టాడు. దీంతో కంగారుపడిన రాజేశ్వరి తల్లి ఈ నెల 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్‌పై వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన పోలీసులకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వివరించాడు. దీంతో రాజేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామమందిర ప్రారంభోత్సవం - 108 అడుగుల అగర్‌బత్తీ తయారీ