Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (11:03 IST)
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు హెచ్.ఐ.వి. బాధితురాలిని సైతం వదిలిపెట్టలేదు. 16 యేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
బాధితురాలి తరపు బంధువులు వెల్లడించిన వివరాల మేరకు.. రాయచోటి మండలం పెమ్మాడపల్లి గ్రామానికి చెందిన 16 యేళ్ల బాలికకు తల్లిదండ్రుల ద్వారా హెచ్.ఐ.వి. సోకింది. కొన్నాళ్ల కిందట తల్లిదండ్రులు మృతి చెందారు. ఆమె ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె ప్రతినెల హెచ్.ఐ.వి. నివారణ కోసం మందుల కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి వస్తూపోతుండేది. సుండుపల్లి మండలం జంగంపల్లికి చెందిన టి.విజయకుమార్ రాయచోటి ఆ ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడు. 
 
ఈ క్రమంలో విజయకుమార్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలికకు గర్భందాల్చడంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్న కౌన్సిలర్ విషయాన్ని బంధువులకు తెలిపారు. వారు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆమెను చేర్చించారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషనులో నిందితుడు విజయ కుమారుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం