Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ష్... నిశ్శబ్దంగా ఉండండి.. డిప్యూటీ సీఎం వివాదంపై జనసేన ఆదేశాలు

Advertiesment
jana sena party

ఠాగూర్

, మంగళవారం, 21 జనవరి 2025 (16:55 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్‌పై జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ అంశంపై పార్టీ నేతలు లేదా కార్యకర్తలు ఎవ్వరూ నోరు మెదపవద్దని కోరింది. 
 
గత కొన్ని రోజులుగా ఈ డిప్యూటీ సీఎం అంశంపై  టీడీపీ, జనసేన నేతలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ అధిష్టానం మంగళవారం స్పందించింది. ఇకపై ఈ అంసఁపై పార్టీకి చెందిన నేతలెవ్వరూ బాహాటంగా స్పదించవద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని కేంద్ర కార్యాలయం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
ఇదే అంశంపై టీడీపీ అధిష్టానం కూడా సోమవారం ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. లోక్‌శ్‌ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని నేతలను ఆదేశించింది. ఏ ఒక్క నేత కూడా మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని కోరింది. 
 
భార్య కడుపుపై కూర్చొని భర్త చిత్రహింసలు - నిండు చూలాలు మృతి!! 
తెలంగాణ రాష్ట్రంలో ఓ అమానవీయ ఘటన ఒకటి జరిగింది. అనుమానం పెనుభూతమై.. ఓ నిండు చూలాలు, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. భార్య కడుపు మీద కూర్చుని భర్త హింసించడంతో గర్భస్థ శిశువు కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18వ తేదీన జరిగింది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేసిన పోలీసులు.. అవి హత్యలేనని తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు... కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ (21)కు ఇన్‌స్టాగ్రామ్‌లో కాప్రాకు చెందిన స్నేహ(21)తో పరిచయం ఏర్పడింది. 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తొలుత సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. 2023లో వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. 
 
ఈ క్రమంలో తన బిడ్డను పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మాలని పథకం వేసి రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్నేహ కుషాయిగూడ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆ బాబు మృతిచెందాడు. 
 
వరుస ఘటనలు, గొడవల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ కొన్నినెలలు దూరంగా ఉన్నారు. కాప్రాలో ఓ గది అద్దెకు తీసుకుని గత ఏడాది డిసెంబరు 11 నుంచి మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే, భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్.. గర్భం ఎలా దాల్చావంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమెను మట్టుపెట్టాలని పథకం రచించాడు.
 
ఈ నెల 15న రాత్రి భార్యకు మద్యం తాగించాడు. 16న ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. మీద కూర్చుని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా బయటకొచ్చి మృత్యువాత పడింది. 
 
అనంతరం ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వంటగదిలోని సిలిండరును తీసుకొచ్చి గ్యాస్ లీకయ్యేలా పైపును బయటకు తీసి పారిపోయాడు. సిలిండరులో గ్యాస్ అయిపోవడంతో అతడి పన్నాగం బెడిసికొట్టింది. ఈ నెల 18వ తేదీన గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పరిస్థితులు చూసిన పోలీసులు కేసు నమోదు చేసి భర్తపై అనుమానంతో వెతికారు. నిందితుడు కాచిగూడలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.20లో ప్రీపెయిడ్ సిమ్ కార్డు యాక్టివ్.. ట్రాయ్ నయా రూల్