Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ రాష్ట్రంలో మైనర్‌ కిడ్నాప్.. అత్యాచారం

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (13:44 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికకు రాత్రంతా నరకం చూపించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని ధోల్​పుర్​ జిల్లా బారీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భరత్‌పూర్‌లో ఈ నెల 26న సాయంత్రం బాధితురాలు.. కూరగాయలు కొనడానికి మార్కెట్​కు వెళ్లింది. అదేసమయంలో ఓ యువకుడు.. తన బైక్​పై బాలికను బలవంతంగా ఎక్కించుకుని బాసేడీ రోడ్డు టోల్ వద్ద వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు.. ఆమెను కిడ్నాప్​ చేసి ఓ ఇంటికి తీసుకెళ్లారు. 
 
అక్కడ రాత్రంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యులు తమ కుమార్తె కోసం వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు. తర్వాత రోజు ఉదయం ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్న బాధితురాలు.. తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పింది. 
 
వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్​ చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments