మేనకోడలిని రేప్ చేసిన బిజినెస్‌మ్యాన్ - ఆపై చంపేస్తానంటూ వార్నింగులు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (10:46 IST)
తన మేనకోడలిపై ఓ బిజినెస్‌మ్యాన్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే హత్య చేస్తానని బెదిరించాడు. పైగా, డి గ్యాంగ్‌తో చెప్పి ఈ భూమ్మీద లేకుండా చేస్తానని వార్నింగులు ఇచ్చాడు. ఇలా ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ముంబైలో వెలుగుచూసింది. 
 
ముంబైకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ గత 2007 నుంచి అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఇతర క్రిమినల్స్‌తో సంబంధాలు ఉన్నాయంటూ తనను బెదిరిస్తున్నాడంటూ 35 ఏళ్ల మహిళ అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
'నిందితుడు తొలిసారి 2007లో ఓ హోటల్‌లో తనను రేప్‌ చేశాడని బాధితురాలు చెప్పింది. ఆ తర్వాత ముంబై సబర్బన్‌లోని పలుచోట్ల ఆమెపై అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని బెదిరిస్తుండేవాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తనకు స్నేహితుడని.. మరో కరడుగట్టిన నేరస్థుడు కూడా బంధువని చెబుతూ వారితో చంపిస్తానంటూ బెదిరించినట్టు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
 
అంతేకాకుండా, నిందితుడు తన నుంచి ఒక శాతం వడ్డీపై రూ.2 కోట్లు రుణంగా తీసుకున్నాడని, కానీ ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అంధేరి ప్రాంతంలో నివాసం ఉండటంతో అంబోలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాపారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసును తదుపరి దర్యాప్తు కోసం ఎంఐడీసీ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments