Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో కొత్తగా రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు గుర్తింపు

coronavirus
, మంగళవారం, 14 జూన్ 2022 (15:37 IST)
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తగ్గినప్పటికీ దాని ఉప వేరియంట్లు మాత్రం కొత్తగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్‌లో రెండు సబ్ వేరియంట్లను గుర్తించారు. వీటికి బీఏ4, బీఏ5 అని నామకరణం చేశారు. ఈ యేడాది ఆరంభంలో కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఉధృతంగా వ్యాపించిన విషయం తెల్సిందే. దీని నుంచి కొత్తగా ఉప వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులోభాగంగా, ఇపుడు ముంబైలో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. 
 
ముంబై మహానగరంలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్లల ముగ్గురికి బీఏ 4, ఒకరికి బీఏ5 పాజిటివ్ అని తేలింది. అయితే, ఈ నలుగురూ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నట్టు బీఎంసీ వైద్య వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ వీరిందరిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. 
 
కాగా, మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ సబ్ వేరియంట్ కేసులు 13 నమోదైవున్నాయి. అదేసమయంలో మరికొన్ని ప్రపంచ దేశాల్లో ఈ సబ్ వేరియంట్ల మళ్లీ ఊపందుకున్నాయి. భారత్‌లోనూ కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ గత 24 గంటల్లో ఈ కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వస్తే.. మేమంతా ఆత్మహత్య చేసుకుంటాం..