Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రికార్డు సమయంలో 445 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన యాక్సిస్‌ ఎనర్జీ, బ్రూక్‌ఫీల్డ్‌

electric
, శనివారం, 11 జూన్ 2022 (16:59 IST)
సుప్రసిద్ధ పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ యాక్సిస్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (యాక్సిస్‌ ఎనర్జీ) రికార్డు సమయంలో 445 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌ను కేవలం ఆరు నెలల్లో పనిచేసేలా చేయగలిగింది యాక్సిస్‌ ఎనర్జీ. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఈ ప్రాజెక్ట్‌ గణనీయంగా తోడ్పడటంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ దిశగా చురుగ్గా పనిచేసేందుకు సైతం తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్ట్‌తో సంవత్సరానికి 6 లక్షల టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ వాతావరణంలో చేరకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. ఇది 24 మిలియన్‌ మొక్కలు నాటడానికి సమానం. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సంవత్సరానికి 800 గిగావాట్‌ హవర్‌ (GWH) స్వచ్ఛమైన విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చ.

 
ఈ ప్రాజెక్ట్‌ను యాక్సిస్‌ ఎనర్జీ, బ్రూక్‌ఫీల్డ్‌ రెన్యువబల్స్‌లు తమ భాగస్వామ్య సంస్ధ ఏబీసీ రెన్యువబల్స్‌ ద్వారా అభివృద్ధి చేశాయి. దీనిని 5 గిగా వాట్ల భారీ యుటిలిటీ స్ధాయి పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్ధ. ప్రస్తుతం ఈ సంస్థ 1.2 గిగావాట్ల ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలలో ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ అపూర్వమైన విజయం సాధించిందని యాక్సిస్‌ ఎనర్జీ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె రవి కుమార్‌ రెడ్డి వెల్లడిస్తూ అతి తక్కువ కాలంలోనే 445 మెగా వాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తీసుకురావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచే ప్రాజెక్ట్‌లను చేపట్టడంతో పాటుగా పర్యావరణానికి, పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి అత్యుత్తమ సహకారం అందించాలని యాక్సిస్‌ ఎనర్జీ భావిస్తోందని ఆయన తెలిపారు.

 
సౌర, విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల పరంగా ఓ దశాబ్ద కాలంలో 2గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసిన అనుభవం కలిగిన సంస్థ యాక్సిస్‌ ఎనర్జీ. పునరుత్పాదక విద్యుత్‌ (ఆర్‌ఈ) రంగంలో యాక్సిస్‌ ఎనర్జీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని బ్రూక్‌ఫీల్డ్‌ సంస్ధ తమ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల కోసం భాగస్వామ్యం చేసుకుంది. ఇటీవలనే ఆటోమోటివ్‌ రంగం కోసం ఉత్పత్తి  అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద విజయవంతంగా నమోదుకావడంతో  పాటుగా భారతదేశపు డీకార్బనైజేషన్‌ లక్ష్యాలకు సహాయపడేందుకు స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలతో నిలకడతో కూడిన స్వచ్ఛమైన రవాణా పరిష్కాలను సైతం యాక్సెస్‌ ఎనర్జీ అందించడానికి కట్టుబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్‌తో చనిపోయిన భర్త అస్థికలను ఆమె లాకెట్‌లో పెట్టుకుని బతుకుతున్నారు...