Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (11:49 IST)
ఈ మధ్యకాలంలో సమాజంలో జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మనుషుల అనురాగాలు, ఆప్యాయతలు, మానవసంబంధాలు అనేవి మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ కారణంగా సమాజం సిగ్గుపడేలా చర్యలకు పాల్పడుతున్నారు. తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని భర్తీ చేసేది మేనమామే అని మన పెద్దలు అంటుంటారు. అలాంటి మేనమామ.. కంటికి రెప్పలా చూడాల్సిన ఆరేళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక అమ్మ, అమ్మమ్మలు గుడికి వచ్చేలోపు ఈ దారుణం జరిగిపోయింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నవరాత్రి వేడుకల్లో భాగంగా ఈ నెల 5వ తేదీన ఆరేళ్ల మైనర్ బాలిక 'కన్యా భోజ్' కోసం తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఆమె తిరిగి వెళ్లలేదు. దీంతో పాప కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
బాలిక అమ్మమ్మ, బంధువు ఆలయానికి వెళ్లగా సోమేశ్ యాదవ్ అనే మేనమామ, బాలిక మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీనిని తనకు అవకాశంగా తీసుకున్న నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని పొరుగింటి వారి కారులో పడేశాడు. కారు ఎపుడూ అక్కడే పార్క్ చేసివుండటం, ఒక డోర్‌కు లాక్ లేకపోవడంతో ఈ కారు అనుకూలంగా ఉంటుందని భావించాడు. 
 
పోలీసుల దర్యాప్తులో నిజం తేలడంతో సోమేశ్ యాదవ్‌తో సహా అతనికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితుల్లో ఒకరు కారు యజమానికావడం గమనార్హం. విచారణ తర్వాత అతన్ని పోలీసులు విడిపించారు. అలాగే, చిన్నారి శరీరంపై గాయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఆ బాలికపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు గుర్తించారు. బాలిక మేనమామ వద్ద జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments