Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెకు రెండో పెళ్లి చేయాలని మనవరాలిని చంపేసిన అమ్మమ్మ...

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (11:57 IST)
ఏపీలో దారుణం జరిగింది. కుమార్తెకు పునర్వివాహం వివాహం చేయాలని భావించిన కన్నతల్లి తన మనవరాలిని హత్య చేసింది. ఈ హత్యలో కన్నతల్లి కూడా పాలుపంచుకుంది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం మండలం, నరసింగపురంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన శైలజ, సతీష్ అనే యువతీయవకులు ప్రేమించుకున్నారు. రెండేళ్ళ క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కులాంతక వివాహం చేసుకున్నారు. వీరి కాపురానికి గుర్తుగా యశ్విత అనే కుమార్తె పుట్టింది. 
 
అయితే, ఈ కులాంతర వివాహం శైలజ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో శైలజ, సతీశ్‌లకు మనస్పర్థలు తలెత్తాయి. దీంతో కుమార్తెను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. మనవరాలితో వచ్చిన కుమార్తెను చేరదీసిన కన్నతల్లి.. నెమ్మదిగా కుమార్తె మనసు మార్చింది. తమ కులంలోనే మంచి యువకుడుని చూసి మళ్లీ పెళ్లి చేస్తానని నమ్మబలికింది. 
 
అయితే, రెండో పెళ్ళికి మనవరాలు అడ్డుగా మారింది. దీంతో బిడ్డను అడ్డుతొలగించుకోవాలని ఇద్దరూ కలిసి పథకం వేశారు. ఈ నెల 6వ తేదీన పసికందు యశ్విత గొంతు నులిమి హత్య చేశారు. ఆపై పక్కింట్లోని బావిలోపడేశారు. గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి తమ బిడ్డను చంపేశారంటూ ఇరుగుపొరుగువారిని నమ్మబలికారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో తల్లీ కుమార్తెల మీద అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. శైలజ రెండో పెళ్లికి అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో తామే బిడ్డను చంపేసినట్టు అంగీకరించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ రియల్ ఎస్టేట్ గా మారింది : కస్తూరిశీను, మద్దినేని రమేష్

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ తర్వాత చరిత్ర సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments