సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వీడియోలు చూస్తుంటే రోడ్డుపై నడవడం చాలా డేంజర్ అని అర్థమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వీడియోలు ఎన్నో వున్నాయి. నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాలు ప్రాణాలు తీసుకుంటున్నాయి.
తాజాగా ఓ ముస్లిం మహిళ తన బిడ్డతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అయితే రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఆమెను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. రోడ్డు సైడ్ ఆ మహిళ చేతిలో తన కుమారుడితో నడిచి వెళ్తోంది.
ఇంతలో తెల్లటి కారు వేగంగా ఆ ముస్లిం మహిళను ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొనడంతో ఆ మహిళ ఎగరి ఆమడ దూరం పడిపోయింది. తల్లికి ఏం జరిగిందని తెలియక అలా చూస్తూ.. తల్లి పడిపోయిన ప్రాంతానికి ఆ బాలుడు పరిగెత్తికెళ్లి చూశాడు.
ఇంతలో స్థానికులు ఆ బాలుడికి సాయం చేసేందుకు పరుగులు తీశారు. ఆపై ఏం జరిగిందో వీడియోలో క్లారిటీ లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.