Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:58 IST)
ఢిల్లీలోని నక్షత్ర హోటల్ లీలా ప్యాలెస్‌ హోటల్‌కు టోకరా వేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితుడుని దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్‌గా గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుతో మూడు నెలల పాటు హోటల్‌లో బస చేసి, ఆ తర్వాత బిల్లు చెల్లించకుండా పారిపోయాడు. చివరకు హోటల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మోసగాడిని అరెస్టు చేశారు. 
 
దక్షిణ కన్నడకు చెందిన మహమ్మద్ షరీఫ్ (41) అనే వ్యక్తి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌ సిబ్బందికి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించాడు. నకిలీ బిజినెస్ కార్డును చూపించి మూడు నెలల పాటు హోటల్‌లోనే ఉన్నాడు. దీంతో అతని మొత్తం బిల్లు రూ.23,46,413కు చేరుకుంది. 
 
ఆ తర్వాత బిల్లును చెల్లించకుండా హోటల్‌కు చెందిన విలువైన వస్తువులతో పారిపోయాడు. దీనిపై హోటల్ సిబ్బంది ఈ నెల 14వ తేదీన ఢిల్లీ సరోజిని నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... వెంటనే రంగంలోకి దిగి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments