తల్లిదండ్రులతో వెళ్లేందుకు సమ్మతించిన ప్రేయసి.. కోర్టులోనే ప్రియుడి ఆత్మహత్యాయత్నం

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (19:53 IST)
ఒక నెల రోజులుగా తనతో కలిసివుంటున్న ప్రియురాలు ఉన్నట్టుండి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేందుకు ఇష్టపడటాన్ని ఆ ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కోర్టుహాలులోనే చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాకు చెందిన విష్ణు (31) అనే యువకుడితో 23 యేళ్ల యువతి గత నెల రోజులుగా సహజీవనం చేస్తుంది. దీంతో యువతి తండ్రి కోర్టును ఆశ్రయించి, హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ యువతీ యువకుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా జరిగిన విచారణలో యువతి తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఇష్టపడింది. తాను తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్తానని న్యాయమూర్తి అను శివరామన్, సి.జయచంద్రన్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపింది. విష్ణును చూస్తే తనకు సోదరభావం తప్ప రొమాంటిక్ ఫీలింగ్స్ కలగడం లేదని స్పష్టం చేసింది. 
 
అతడు తనను బెదిరించడం వల్లనే తాను కలిసి ఉన్నానని చెప్పింది. విష్ణుకు ఇప్పటికే వివాహమైందని, అయితే, అది చెడిపోయిందని చెప్పి తనను మోసం చేశాడని ఆమె కోర్టుకు తెలిపింది. దీంతో విష్ణు.. తన జేబులో దాచుకున్న కత్తి తీసి కోర్టు హాలులోనే చేతి మణికట్టును కోసుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments