Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదు.. ఫాతిమాకు ఆ కేసు నుంచి విముక్తి

court
, మంగళవారం, 6 జూన్ 2023 (10:17 IST)
కేరళ సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. కొన్నేళ్ల క్రితం ఫాతిమా నెట్టింట షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఆ వీడియోలో పడుకుని ఫాతిమా తన శరీరం పైభాగంపై పెయింటింగ్ వేసుకున్నారు. ఈ కేసు నుంచి ఆమెకు విముక్తి లభించింది. 
 
ఫాతిమా తన దేహాన్ని పిల్లలకు కాన్వాస్‌గా ఉపయోగించిందే తప్ప లైంగిక ఉద్రేకాలను తృప్తి పరుచుకోడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్టు భావించకూడదని తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఫాతిమాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కేసుల నుంచి ఆమెకు విముక్తి కల్పించిన న్యాయమూర్తి నగ్నత్వం, అశ్లీలత ఒకటి కాదని వ్యాఖ్యానించారు. మహిళలకు తమ శరీరాలపైనే హక్కులేకుండా పోతోందని.. ఈ విషయంలో వారికి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు వుందని కోర్టు స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు జైలు ఖైదీలకు గుడ్ న్యూస్.. మెనూలో చికెన్ గ్రేవీ