మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అవినాశ్ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పలు షరతులు కూడా విధించింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినట్లయితే రూ. 5లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది.
తాజాగా అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. బెయిల్ నిబంధనల ప్రకారం.. ప్రతి శనివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వుంటుంది.