అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

ఠాగూర్
ఆదివారం, 29 జూన్ 2025 (14:27 IST)
అక్రమ సంబంధాలతో పలువురు పురుషులు ప్రాణాలు కోల్పోతారు. తమ ప్రియుళ్లతో కలిసి పలువురు మహిళలు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి పాల్పడింది కూడా కట్టుకున్న భార్యే కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిందో భార్య. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాన్ని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ బావిలో పడేసింది. ఈ ఘటన జూన్ 24వ తేదీన తుమకూరు జిల్లా తిపూరు తాలూకాలోని కడశెట్టిహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కడశెట్టిహళ్లి గ్రామానికి చెందిన శంకరమూర్తి (50) తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య సుమంగళ తిపూరులోని కల్పతరు బాలికల హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కరదాలుశాంతే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సుమంగళ, ప్రియుడు నాగరాజుతో కలిసి అతడిని హతమార్చాలని పథకం పన్నింది.
 
పథకం ప్రకారం జూన్ 24న భర్త శంకరమూర్తి కళ్లలో సుమంగళ కారం పొడి చల్లింది. అనంతరం కర్రతో దారుణంగా కొట్టి, గొంతుపై కాలితో తొక్కి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కి, సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురువెకెరె తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలోని బావిలో పడేసింది.
 
శంకరమూర్తి కనిపించకపోవడంతో మొదట నొణవినకెరె పోలీస్ స్టేషనులో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు శంకరమూర్తి మంచం వద్ద కారం పొడి ఆనవాళ్లు, పెనుగులాట జరిగిన గుర్తులు గుర్తించి అనుమానంతో విచారణ ముమ్మరం చేశారు. సుమంగళ మొబైల్ కాల్ డేటా రికార్డులను పరిశీలించి, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments