ఇటీవలి కాలంలో సోషల్ మీడియా రీల్స్ పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోతోంది. ప్రమాదకర ఫీట్స్‌తో పాటు జుగుప్సకర దృశ్యాలను కూడా ఎలాంటి సంకోచం లేకుండా చేస్తున్నారు కొంతమంది యువతీయువకులు. తాజాగా ఇలాంటి ఘటనే కాన్పూర్-ఆగ్రా హైవేపై జరిగింది.
పూర్తి వివరాలు చూస్తే... ఆగ్రా-కాన్పూర్ జాతీయ రహదారిపై ఓ యువకుడు తన ప్రియురాలిని బైకు ఆయిల్ ట్యాంకుపై పడుకోబెట్టాడు. ఆమెతో రొమాన్స్ చేస్తూ బైకుని వేగంగా నడుపుతూ వెళ్లాడు. ఈ సమయంలో అతడు రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని నియమాలను ఉల్లంఘించాడు. బహిరంగ ప్రదేశాలలో ఇలా యువతితో రొమాన్స్ చేస్తూ న్యూసెన్స్ సృష్టించాడు.
మరోవైపు హెల్మెట్ లేకుండా బైకును నడపడమే కాకుండా వేగంగా నడుపుతూ రోడ్డుపై ఇతరులకు కూడా అసౌకర్యాన్ని కలిగించాడు. అతడి స్నేహితురాలికి కూడా హెల్మెట్ లేదు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో రాత్రి పదిన్నరకు జరిగినట్లు తెలుస్తోంది. ఆ దారినే వాహనంలో వెళ్లేవారు బైకుపై రొమాన్స్ చేస్తూ వెళ్తున్న వీరిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. దీనితో అది కాస్తా వైరల్ అయ్యింది.