Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో గొడవపడి ప్రియురాలి ఇంటికి వెళ్లి భర్త ఆత్మహత్య!!

ఠాగూర్
గురువారం, 14 మార్చి 2024 (11:54 IST)
భార్యతో గొడవపడిన ఓ భర్త... తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. అయితే, తన భర్త మృతిపై భార్య అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనిపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాఘవాపురం గ్రామానికి చెందిన రక్తనిస్వామి మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో భార్య భవితతో ఘర్షణపడ్డాడు. ఆ తర్వాత భార్య మీద అలిగి కోపంతో అవుషాపూర్‌లోని ప్రియురాలు దీపిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దీపిక భర్త లేకపోవడంతో ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు. తెల్లవారేసరికి వంటగదిలో స్వామి ఉరేసుకుని కనిపించాడు. తన ప్రియుడు శవమై కనిపించడాన్ని చూసిన దీపిక.. ఆందోళన చెందుతూ ఇబ్రహీంపట్నంలో ఉన్న తన భర్త ముఖేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వంట గదిలో ఉరి వేసుకున్న తీరును పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తన భర్త మరణ వార్త తెలుసుకున్న భవిత కూడా ఇంటికి చేరుకుని. స్వామి ఆత్మహత్య చేసుకున్నాడని దీపిక, ముఖేశ్ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని, తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments