Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2024: మీ కిడ్నీల ఆరోగ్యం ముఖ్యం..

సెల్వి
గురువారం, 14 మార్చి 2024 (11:41 IST)
మార్చి నెలలో రెండవ గురువారాన్ని ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా పాటిస్తారు. ఈ సంవత్సరం, ఈ రోజు మార్చి 14 న వస్తుంది. ఆరోగ్యానికి కిడ్నీల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే దిశగా ఈ రోజును పాటిస్తారు. ఈ రోజున నెఫ్రాలజిస్టులు కిడ్నీ వ్యాధులు, దానితో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ఓ అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తారు. ఇంకా కిడ్నీ వ్యాధులను ఎలా తగ్గించాలనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.  
 
ప్రపంచ ఆరోగ్య అవగాహన ప్రచారాన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ , ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్ ప్రతి ఏడాది నిర్వహిస్తోంది. ఇక ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని మొదటిసారిగా 2006లో జరుపుకున్నారు.
 
కిడ్నీ సమస్యలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరించాలి. కిడ్నీ వ్యాధుల  వల్ల కలిగే ప్రమాద కారకాలు,  ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజుటి లక్ష్యం. మూత్రపిండాలు మన శరీరానికి ఒక ప్రత్యేక వడపోత వ్యవస్థ. ఇవి రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. 
 
ఇవి శరీరంలోని వివిధ పదార్థాల స్థాయిలను నియంత్రించడమే కాకుండా, రక్తపోటును నియంత్రించడంలో కూడా దోహదం చేస్తాయి. అందువల్ల, మన మూత్రపిండాలు ఆరోగ్యంతో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం దాని గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments