నేచురల్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, విగ్స్ బ్రాండ్ హెయిర్ ఒరిజినల్స్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించడంతో, D2C బ్రాండ్ తమ మార్కెట్ ఉనికిని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) హెయిర్ ఎక్స్‌టెన్షన్స్, విగ్ బ్రాండ్ హెయిర్ ఒరిజినల్స్ మార్చి 1న తమ ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్‌ను వైభవంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
2500 చదరపు అడుగుల ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇప్పటి వరకు హెయిర్ ఒరిజినల్స్‌కు అతిపెద్దది కాబట్టి ఈ ప్రారంభం D2C బ్రాండ్‌కు ఒక ప్రత్యేక మైలురాయిని సూచిస్తుంది. ఈ స్టోర్ పురుషులు, మహిళలు ఇద్దరికీ సమగ్రమైన పరిష్కారాలను అందించనుంది. రాబోయే స్టోర్ ప్రారంభంతో, బ్రాండ్ రాబోయే 12 నెలల్లో 3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. ఈ వ్యూహాత్మక విస్తరణ ద్వారా, 2023-2028 మధ్యకాలంలో 8.87% CAGR వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేయబడిన భారతీయ హెయిర్ ఎక్స్‌టెన్షన్, విగ్స్ మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.
త్వరలో చేయబోయే ప్రారంభోత్సవాన్ని వేడుక చేయడానికి, హెయిర్ ఒరిజినల్స్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించటానికి, మొదటి 500 మంది కస్టమర్‌లు చేసిన కొనుగోళ్లపైకు ప్రత్యేక తగ్గింపులను అందించాలని యోచిస్తోంది. మునుపటి స్టోర్ల కంటే రెండు నుండి మూడు రెట్లు విస్తీర్ణంలో ఉన్న కొత్త స్టోర్, 25 మంది సభ్యులతో అంకితమైన సిబ్బందిని కలిగి ఉంటుంది. ఏకకాలంలో 20 మంది వినియోగదారులకు సేవలను అందిస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో స్కాల్ప్ టాపర్, ఇన్విజిబుల్ సైడ్ ప్యాచ్‌ల నుండి వాల్యూమైజర్‌లు, క్లిప్ సెట్‌ల వరకు పూర్తి హెయిర్ ఎక్స్‌టెన్షన్‌ల శ్రేణి అందుబాటులో వుంటుంది. సెంటర్‌లోని ఉత్పత్తుల అంతటా ఉచిత ట్రయల్ సేవలను అందిస్తుంది. పురుషుల ప్యాచ్ సేవలు కూడా ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రతిషాత్మక స్టోర్ ప్రారంభం గురించి హెయిర్ ఒరిజినల్స్ సీఈఓ శ్రీ జితేంద్ర శర్మ, మాట్లాడుతూ “హైదరాబాద్‌లో నాణ్యమైన సహజ జుట్టు ఎక్సటెన్షన్స్, విగ్స్ ఉత్పత్తుల కొరతను పూడ్చేందుకు, కస్టమర్లకు 'కొనుగోళ్లకు ముందు అనుభవం' నేపథ్యంను పరిచయం చేసేందుకు హైదరాబాద్‌లో మా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించటం పట్ల సంతోషంగా వున్నాము. ఇప్పటివరకు మా అతిపెద్ద స్టోర్‌గా ప్రారంభంకానున్న ఈ ఎక్సపీరియెన్స్ కేంద్రం మా క్లయింట్‌ల ప్రత్యేక అవసరాలను తీర్చడమే కాకుండా మా భవిష్యత్ విస్తరణలన్నింటికీ బెంచ్‌మార్క్‌గా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను.." అని అన్నారు.