Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

ఠాగూర్
గురువారం, 22 మే 2025 (08:23 IST)
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మైనర్ బాలుడుని ఓ వ్యక్తి చంపేశాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో గులాబీ నగర్ ప్రాంతంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... 
 
ఈ నెల 19, 20 తేదీల మధ్య రాత్రి సమయంలో ముఖేష్ ఠాకూర్, మృతుడు జతిన్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత జతిన్ తన భార్య సుధతో అసభ్యకరమైన స్థితిలో ఉండగా ముఖేశ్ చూశాడని పోలీసులు వెల్లడించారు. మరుసటి రోజు ఉదయం సుధ రోషనాలాలోని ఓ బొమ్మల ఫ్యాక్టరీకి పనికి వెళ్లిన తర్వాత ముఖేష్, జతిన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ముఖేష్, ఇంట్లోని చిన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకుని జతిన్ తలపై పలుమార్లు బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుడు జతిన్ ముఖేష్ భార్య సుధకు తెలిసిన వ్యక్తి ద్వారా వారి ఇంట్లో అద్దెకు దిగాడు. 
 
ఈ హత్య తర్వాత ముఖేష్ అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముఖేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments