Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణం.. తలలేదు.. ఒంటిపై నూలుపోగు లేదు..

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (12:21 IST)
మహారాష్ట్రలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, మథేరన్‌లో గోరేగావ్‌కు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. వీకెండ్‌లో మథేరన్‌కు చాలామంది టూరిస్టులు వస్తుంటారు. 
 
శని, ఆది వారాలు మథేరన్‌ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. అలాంటిది.. గత ఆదివారం మహిళ శవం, అదీ తల లేని మృతదేహం కనిపించడంతో అందరూ భయాందోళనలకు లోనయ్యారు.
 
మథేరన్‌లోని లాడ్జిలో మహిళ మృతదేహం కనిపించింది. మథేరన్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జిలో ఈ ఘటన జరిగింది. మహిళ తల కనిపించలేదు. అంతేకాదు.. ఒంటిపై నూలుపోగు లేని స్థితిలో ఆ మహిళ మృతదేహం కనిపించడం శోచనీయం. ఈ కేసును విచారించిన పోలీసులు ఆ మృతదేహం పూనమ్ పాల్‌ అనే మహిళ అని తేల్చారు. కత్తితో ఆమె తలను కోసి దారుణంగా హత్య చేశాడు నిందితుడు.
 
పోలీసులు లాడ్జిలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా పూనమ్ పాల్, ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి మాస్క్‌ పెట్టుకుని కనిపించారు. లాడ్జి సిబ్బంది ఆధార్ గానీ, ఎలాంటి ఐడెంటిటీ కార్డు అడగకుండానే రూం ఇవ్వడంతో హంతకుడిని గుర్తించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
 
ఎట్టకేలకు పోలీసులు ఓ హ్యాండ్‌బ్యాగ్‌ను గుర్తించారు. ఇంకా పూనమ్ పాల్ కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments