కోవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్ చిన్నపిల్లలపైన కూడా విరుచుకుపడుతున్నట్లు తాజా కేసుతో వెల్లడైంది. ఈ నేపధ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ పైన ఆందోళనలు నెలకొంటున్నాయి.
ముంబైలో డిసెంబర్ 11, 12 తేదీల్లో ర్యాలీలను, పార్టీలను నిషేధిస్తూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrCP) సెక్షన్ 144 విధించబడింది. ఈ ఉత్తర్వును ఉల్లంఘించినవారు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 188 ప్రకారం శిక్షించబడతారు. మహారాష్ట్రలో శుక్రవారం ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, వీరిలో ఒకటిన్నర సంవత్సరాల పసిబిడ్డ కూడా ఉన్నాడు.
ఏడు కేసులలో, మూడు ముంబైలో, నాలుగు పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి నమోదయ్యాయి. 48, 25, 37 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పురుషులు వరుసగా టాంజానియా, యూకె, దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చారు. మరో నలుగురు రోగులు డిసెంబర్ 6న కొత్త వేరియంట్‌తో బారిన పడ్డారు. వీరు నైజీరియన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.