Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రియుడితడే, ఇతడినే పెళ్లాడుతానంటూ కుమార్తె, ఆ తల్లి ఏం చేసిందంటే...

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (23:23 IST)
భర్త అనారోగ్యంతో ఐదేళ్ళ క్రితం చనిపోయాడు. కూతురితో ఆమె కలిసి ఉంటోంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పెన్షన్ వస్తూ ఉండేది. దీంతో ఇంటిని అలా నడుపుకుంటూ వస్తోంది ఆ మహిళ. అయితే కుమార్తె ఒక యువకుడిని ప్రేమించింది. ఏ మాత్రం భయపడకుండా అతనే తన ప్రియుడిని పెళ్ళి చేసుకుంటానంది. అయితే ఆ యువకుడు అందంగా ఉండడంతో కూతురే కాదు తల్లి కూడా కనెక్టయ్యింది. చివరకు..

 
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలో నివాసముంటున్నారు పద్మావతి, సునీత. పద్మావతి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. రైల్వే ఉద్యోగిగా పద్మావతి భర్త పనిచేయడంతో ఆమెకు పెన్షన్ ఎక్కువగా వస్తూ ఉండేది. దీంతో కుమార్తెను చదివించుకుంటూ ఇంటి పట్టునే ఉండేది పద్మావతి. ఎవరితోను మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటూ వచ్చేది.

 
అయితే సునీత డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో కుమార్ అనే సెల్ ఫోన్ షాపు యజమాని ఆమెకు పరిచయమయ్యాడు. మొబైట్ రిపేర్ కోసం షాపుకు వెళ్ళిన సునీతకు అక్కడ కనెక్టయ్యాడు కుమార్. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్ళి వరకు వెళ్ళేలా చేసింది. 

 
సునీత భయపడకుండా కుమార్‌ను తన తల్లికి పరిచయం చేసింది. కుమార్ బాగా అందంగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. తండ్రి సహాయంతో సెల్ ఫోన్ దుకాణం నడుపుకుంటూ ఉన్నాడు. కుమార్తెతో మాట్లాడేందుకు వచ్చే కుమార్‌తో పద్మావతి మాటలు పెట్టుకునేది. టైంపాస్ చేయడం మొదలెట్టింది. అలా కుమార్‌కు దగ్గరైంది. అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. విషయం బయటకు తెలియకుండా ఉండాలని కుమార్ దగ్గర ఒట్టు కూడా వేయించుకుంది.

 
విషయం సునీతకు తెలిసింది. లోలోపల మథనపడి పోయింది సునీత. తల్లి, ప్రియుడు కలిసి మోసం చేస్తున్నారని మనస్థాపానికి గురై సుసైడ్ చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. అంతకుముందే సుసైడ్ లేఖను రాసింది. అయితే ఆ లేఖను కాల్చేసింది పద్మావతి. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అన్ని విషయాలను చెప్పేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments