Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ యాప్‌ నిర్వాహకుల వేధింపులు : మరో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (13:36 IST)
లోన్ యాప్‌ నిర్వాహకులు వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థి మృతి. తాను తీసుకున్న రుణం తిరిగి చెల్లించినా వేధిస్తున్నారంటూ గతంలో పొలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఆ విద్యార్థి బలవన్మరణం చెందారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా కడియంలోని భాస్కర నగరులో నివాసం ఉంటున్న సురకాల శ్రీనుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సురకాసుల హరికృష్ణ(18) సూరంపాలెంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరి 23న 'పెపీ' అనే లోన్యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించినా ఇంకా చెల్లించాలని ఒత్తిడి తేవడం, నగ్నఫొటోలు పంపుతామని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పెట్టీక్యాష్ లోన్ యాప్ నుంచి హరికృష్ణ తీసుకున్నది రూ.5 వేలు అయితే రూ.21 వేలు వరకు చెల్లించాలంటూ మెసేజ్‌లు పంపారు. దీనితో భయపడి క్యాష్ లెంట్, లోన్ ప్లానెట్, స్మాల్ క్రెడిట్‌తో సహా నాలుగు లోన్ యాప్‌ల ద్వారా రూ.25 వేలు తీసుకుని పెట్టీక్యాష్‌కు రూ.21 వేలు చెల్లించాడు. 
 
అయితే ఇదే ఏడాది ఫిబ్రవరి 15న నాలుగు యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించినప్పటికీ క్యాష్ లెంట్, లోన్ ప్లానెట్, స్మాల్ క్రెడిట్, క్రెడిట్ పార్టీ లోన్ల వారు కొన్ని నంబర్ల ద్వారా ఫోన్లు చేస్తూ సొమ్ము చెల్లించాలని లేకుంటే కుటుంబ సభ్యులందరికీ, కాంటాక్ట్ నంబర్లకూ న్యూడ్ ఫొటోలు పంపుతామని బెదిరించారు. 
 
ఈ విషయంపై గతంలో కడియం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే హరికృష్ణ ఈ నెల 6న చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందినట్టు తండ్రి శ్రీను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొ న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments