Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మహిళతో ఇద్దరు ఆటో డ్రైవర్ల అక్రమ సంబంధం.. హన్మకొండలో లైవ్ మర్డర్ (Video)

ఠాగూర్
బుధవారం, 22 జనవరి 2025 (14:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో పట్టపగలే ఓ దారుణం జరిగింది. ఇద్దరు ఆటో డ్రైవర్లు కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ లైవ్ మర్డర్‌ను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మృతుడు ఓ ఆటో డ్రైవర్ మాచర్ల రాజ్‌కుమార్‌గా గుర్తించారు. ఈ లైవ్ మర్డర్ హన్మకొండలోని అదాలత్ జంక్షన్‌ సమీపంలో బుధవారం జరిగింది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలిపారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బొల్లికొండ లావణ్య అనే మహిళతో రాజ్‌‍కుమార్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. ఆ మహిళ విషయంపై వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి రాజ్ కుమార్‌ను వెంకటేశ్వర్లు హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ లైవ్ మార్డర్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, వీరిద్దరూ ఆటో డ్రైవర్లు కావడం గమనార్హం. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments