Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

Advertiesment
Two men raped a woman

ఐవీఆర్

, మంగళవారం, 21 జనవరి 2025 (18:26 IST)
బెంగళూరులో తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఓ మహిళపై ఆమెతో కలిసి ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. ఈ సంఘటన బెంగళూరులోని ఎస్.జె పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితులను శరవణ, గణేష్‌గా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
 
యలహంక ప్రాంతంలోని తన సోదరుడి ఇంటికి వెళ్లాలని బాధితురాలు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో KR మార్కెట్ బస్ స్టేషన్ సమీపంలో ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను చూసి తమ వాహనాన్ని ఆపారు. ఎక్కడికెళ్లాలని ప్రశ్నించి... రండి మేడమ్ మేం కూడా అటే వెళ్తున్నాం, మిమ్మల్ని అక్కడ దిగబెడతాం అంటూ ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
 
బాధితురాలు వద్ద ఉన్న డబ్బు, సెల్ ఫోన్, నగలను కూడా దోచుకుని ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఐతే పోలీసులు జల్లెడపట్టి నిందితులను అరెస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...