తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (22:30 IST)
తాగుబోతు భర్త వేధింపులను భార్య భరించలేకపోయింది. ఈ వేధింపుల నుంచి విముక్తి పొందేందుకు ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది. ఇందుకోసం కన్నబిడ్డతో పాటు మరో వ్యక్తి సాయం తీసుకుని భర్తను చంపేసింది. మెడకు కండువా బిగించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... బోడుప్పల్ దేవేందర్‌నగర్‌కు చెందిన బండారు అంజయ్య (55) ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్. అతనికి భార్య ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. నిత్యం మద్యం తాగివచ్చి భార్య, పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నాడు. గురువారం రాత్రి భార్య బుగమ్మ, కుమారుడు రాజు, బంధువు శేఖర్‌తో కలిసి అంజయ్య మద్యం తాగారు. 
 
అర్థరాత్రి భార్య, కుమారుడు, బంధువు కలిసి అంజయ్య మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అంజయ్య కుమార్తెను గదిలో బంధించారు. జరిగిన విషయం కుమార్తె చెప్పడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments