Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

Advertiesment
Akhanda Roxx vehicle desiner Amar, Boyapati Seenu

దేవీ

, శుక్రవారం, 28 నవంబరు 2025 (14:17 IST)
Akhanda Roxx vehicle desiner Amar, Boyapati Seenu
అఖండ 2 లో హీరో నందమూరి బాలకృష్ణ  వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, X Studios దానికి అద్భుతమైన సినీమాటిక్ లుక్‌ను అందించింది. పవర్, వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. నందమూరి బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు.  
 
బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వెహికల్ పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన అభిమానులందరికీ  పేరుపేరునా కృతజ్ఞతలు. ఇప్పుడు మీరు చూసిన ఏవి వీడియోలో నా సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దాదాపుగా పది వెహికల్స్ ఉన్నాయి. అమర్ గారు అద్భుతంగా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ రాత్రి పగలు కష్టపడి గొప్పగా  డిజైన్ చేశారు. అందుకు ఆయనని అభినందించాలి. ఈ వెహికల్ ని యాక్షన్ లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్ లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఒక పవర్ వున్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఈ వెహికల్ కూడా అంత పవర్ ఫుల్ గా ఉంటుంది. మేము కోరుకున్నట్టుగా ఈ వెహికల్ ని చాలా తక్కువ రోజుల్లోనే అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చిన అమర్ కి ధన్యవాదాలు. ఈవెంట్ ని ఎంతో ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. అఖండ2  డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా భారత దేశ ఆత్మ. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అందరికీ థాంక్యు వెరీ మచ్.
 
అమర్ మాట్లాడుతూ.. అఖండ2  లో మీరు చూస్తున్న ఈ వెహికల్ స్క్రీన్ మీద మెస్మరైజ్ చేస్తుంది. డైరెక్టర్ బోయపాటి గారితో మాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. అయిన ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఈ వెహికల్ ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఈ ప్రాజెక్ట్ లో బాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ చిత్రం మీ అందరినీ అలరిస్తుంది.
 
అఖండ Roxx — సినిమా, ఇన్నోవేషన్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్ కలిసి సృష్టించిన సెన్సేషనల్ ఈవెంట్ గా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన Xenex, గత 20 ఏళ్లుగా ప్రీమియం ఎంటర్టైన్మెంట్‌ రంగంలో నూతన మైలురాళ్లను సృష్టిస్తూ తరతరాలకు గుర్తుండిపోయే ఈవెంట్లను అందిస్తోంది. ఈ ఏడాది, వారు రెండు అత్యాధునిక కొత్త వింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించడంతో ఇది మరింత చారిత్రక క్షణంగా నిలిచింది.
 
XDrive — ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌కు ప్రతీకగా తొలి హీరో-కాన్సెప్ట్ వెహికిల్‌ను ఆవిష్కరించింది. X Studios  ఈ వాహనం రూపకల్పన వెనుక ఉన్న సృజనాత్మక ఇంజనీరింగ్ శక్తి, సినిమాటిక్ స్టోరీటెల్లింగ్ & మెకానికల్ నైపుణ్యం కలయికగా నిలిచింది. అభిమానులు, మీడియాకు అరుదైన అవకాశంగా, అఖండ 2లోని నందమూరి బాలకృష్ణ గారి ఇప్పటివరకు ఎక్కడా ప్రదర్శించని, విడుదల కాని ప్రత్యేక సన్నివేశాన్ని ప్రదర్శించడం అందరినీ అలరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా