Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతబస్తీలో డ్యాన్సర్ హత్య కేసులో వీడిన మిస్టరీ... నిందితుల అరెస్టు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (13:14 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో జరిగిన ఓ డ్యాన్సర్ హత్య కేసులోని మిస్టరీని ఫలక్‌నుమా పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
ఈ హత్యపై పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 30 యేళ్ళ నృత్యకారిణికి వివాహాలు, ఇతర శుభకార్యాల్లో నృత్యం చేస్తూ తన మొదటి, రెండో భర్తల ద్వారా కలిగిన ఏడుగురు సంతానాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఈమె సోమవారం ముస్తాఫానగర్‌లోని అద్దె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 
 
ఆమెకు మొదటి భర్త విడాకులు ఇవ్వడంతో కొన్నేళ్ల క్రితం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఏడాది క్రితం రెండో భర్త మృతి చెందాడు. చంచల్‌గూడకు చెందిన కారు డ్రైవర్‌ మహ్మద్‌ అఫ్సర్‌(30)తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 
 
ఆమె తనను పెళ్లి చేసుకోవాలని అఫ్సర్‌పై ఒత్తిడి తేవడంతో డ్యాన్స్‌ మానేస్తే చేసుకుంటానని చెప్పాడు. ఈనెల 7న అర్థరాత్రి తన మిత్రుడైన ఓల్డ్‌ మలక్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ నహెద్‌(22)తో కలిసి నృత్యకారిణి ఇంటికి వెళ్లాడు. అక్కడ వీరిద్దరూ మరోమారు పెళ్లి విషయమై మళ్లీ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహంతో నృత్యకారిణి గొంతు నులిమాడు. మహ్మద్‌ నహెద్‌ చున్నీతో ఉరి బిగించాడని పోలీసులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments