Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌ నగరంలో ప్రారంభమైన మహదీయ మేకప్‌ స్టూడియో

Advertiesment
Mahdiyeh’s Makeup Studio
, మంగళవారం, 9 నవంబరు 2021 (22:52 IST)
మహదీయ తమ నూతన మేకప్‌ స్టూడియోను  హైదరాబాద్‌ నగర నడిబొడ్డుగా నిలిచిన బంజారాహిల్స్‌ వద్ద వైవిధ్యమైన బ్రాండ్‌ గుర్తింపుతో ప్రారంభమైంది.
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  వినోద ప్రపంచంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు అతిథులుగా హాజరయ్యారు. ఈ అతిథుల్లో శ్రీ మహమూద్‌ అలీ, తెలంగాణ రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక సేవల మంత్రివర్యులతో పాటుగా భారతీయ నటి, పూర్వ మోడల్‌ నమ్రత శిరోద్కర్‌ ; భారతీయ మోడల్‌, నటుడు అలీ రెజా ఖెరాద్మంద్‌; భారతీయ మోడల్‌, నటుడు మరియు టెలివిజన్‌ పర్సనాలిటీ రోహిత్‌ ఖండేల్‌వాల్‌; ఎంటీవీ రోడీస్‌ పోటీదారు జబీ ఖాన్‌ పాల్గొన్నారు.
 
ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మహదీయ దర్వేష్‌ మాట్లాడుతూ, ‘‘చిన్నతనం నుంచి నాకు మేకప్‌ అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. నా కల నిజమైన రోజు ఇది. నా కల సాకారం కావడంలో మా నాన్న నాకు ఎంతగానో సహాయపడ్డారు. నా స్టూడియో తన గురించి తాను ఎంతగానో వెల్లడిస్తుంది.
 
ఈ స్టూడియో గోడలు, డెకార్‌కు విలాసమే స్ఫూర్తి. ఈ మహదీయాస్‌ మేకప్‌ స్టూడియో ప్రధాన లక్ష్యం, వినియోగదారుల సంతృప్తి. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరి మోములోనూ చిరు నవ్వు చూడాలన్నది నా కోరిక.  కలలకు వాస్తవ రూపాన్ని ఈ స్టూడియో అందిస్తుంది’’ అని అన్నారు.
 
ఈ స్టూడియో పలు సేవలను అందిస్తుంది. వీటిలో అన్ని సందర్భాలకూ తగిన రీతిలో మేకప్స్‌; హెయిర్‌డూస్‌; అన్ని రకాల డ్రేపింగ్స్‌ మరియు జ్యువెలరీ శైలి మొదలైనవి ఉన్నాయి. వివాహం, పార్టీలు, పండుగలు మొదలైన సందర్భాల  కోసం అత్యుత్తమ ఔట్‌ఫిట్స్‌ మరియు ఆభరణాల అవసరాలను సైతం ఇది తీరుస్తుంది. ఇక్కడి మేకప్‌ నైపుణ్యత, ఇతరులకు భిన్నంగా మహదీయా యొక్క స్టూడియోను నిలుపుతుంది.
 
ఈ స్టూడియో అత్యంత విలాసవంతమైన ప్రాంగణంలో ఉంది. ఆధునిక, క్లాసికల్‌ అందాల సమ్మేళనంలా ఈ స్టూడియో ఉంటుంది. వినియోగదారులకు వినూత్నమైన అనుభవాలను అందించడానికి మహదీయ కట్టుబడి ఉంది. దీని యొక్క కలర్‌ పాలెట్‌, బంగారం, ఆఫ్‌-వైట్‌, బీగ్‌, మరూన్‌ రంగులలో ఉంటుంది. మహదీయ యొక్క మేకప్‌ స్టూడియో విలాసవంతమైన, పర్శియన్‌-ఇరానియన్‌ స్ఫూర్తిని ప్రతిబింబించడంతో పాటుగా అన్ని విధాలుగానూ ప్రత్యేక అనుభవాలను మిగులుస్తుంది.
 
ఇరాన్‌లోని మేకప్‌ సంస్కృతితో అధికంగా స్ఫూర్తి పొందిన మహదీయ, ఆ స్ఫూర్తిని ఇండియాకు తీసుకురావాలని కోరుకోవడమే కాదు, ఈ రెండు సంస్కృతుల అద్భుతమైన సమ్మేళనం సృష్టించాలని, అదీ ఇతరులకు భిన్నంగా ఉండేలా ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శించాలని కోరుకుంది. ఆమె మేకప్‌ మరియు మేకప్‌ స్టూడియో రెండూ కూడా  ఇరానియన్‌ నైపుణ్యం కలిగి ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ స్టైల్‌ స్టేట్‌మెంట్‌ సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ స్టూడియో సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెయ్యితో చేసిన సున్నుండలు, భలే టేస్ట్...