Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క అనుకుని నక్కను పెంచారు... రాత్రిపూట అలా అరవడంతో...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (13:00 IST)
Fox
కుక్కని పోలిన అడవి జంతువు నక్క. రాత్రివేళ సంచరిస్తూ ఆహారాన్ని సేకరించే నక్క పిల్లకి కుక్క పిల్లకి పెద్దగా తేడా తెలియదు.  అలా ఓ ఫ్యామిలీ కుక్క అనుకుని పెంచుకుంటే.. కొన్ని రోజుల తర్వాత అది నక్కగా తేలింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతుంది. మరి ఈ ఘటన దక్షిణ అమెరికాలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ అమెరికా దేశం పెరూ రాజధాని లిమాలో ఉండే ఓ ఫ్యామిలీ ఓ కుక్క పిల్లను కొన్నారు. అది ఒంటినిండా జూలుతో చాలా బుజ్జిగా, అందంగా ఉండటంతో ఆ కుక్క పిల్ల ఫ్యామిలీలో అందరికీ తెగ నచ్చేసింది. మిగతా కుక్కల లాగా కాకుండా… ఇది కాస్త వరైటీ జాతిదిలా ఉందనీ… ఇలాంటి కుక్క పిల్ల చుట్టుపక్కల ఎవరికీ లేదని ఆ ఫ్యామిలీ చాలా సంబరపడిపోయింది. అది ఎప్పుడూ చాలా చలాకీగా అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉండటంతో దానికి రన్‌ రన్‌ అని పేరు కూడా పెట్టారు. చట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని చూసి తెగ ముచ్చట పడేవారు. అయితే ఓ 6 నెలల తర్వాత అది కుక్క కాదని తెలిసి ఖంగు తిన్నారు.
 
కొన్నాళ్లకి ఆ తర్వాత రన్ రన్… పరుగులు పెడుతూ… చుట్టుపక్కల వాళ్లు పెంచుకుంటున్న కోళ్లు, బాతుల్ని వెంటాడి, వేటాడి తినడం మొదలుపెట్టింది. దాంతో పొరుగువాళ్లనుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి ఈ ఫ్యామిలీకి. అనుకోకుండా ఇలా జరుగుతోంది అనుకున్న వీళ్లు… పరిహారం కూడా చెల్లించారు. 
 
కానీ ఇదే రిపీట్ అవ్వడం వారికి అనుమానం కలిగించింది. ఆ తర్వాత ఓ రోజు అది రాత్రివేళ నక్కలా అరిచింది. అలా అరవడంతోనే… చుట్టుపక్కల కుక్కలు దానిపై ఫైర్ అయ్యాయి. అప్పుడు ఆ ఫ్యామిలీకి లైట్ వెలిగింది. ఇన్నాళ్లూ తాము పెంచుకున్నది కుక్క కాదనీ… నక్క అని అర్థమైంది. వెంటనే దాన్ని బంధించారు. నక్కేమైనా తెలివి తక్కువదా…. అక్కడినుంచి తప్పించుకుని పారిపోయింది. దాని కోసం పెరూలో అధికారులు వెతుకుతున్నారు. అది దొరికితే…జూకి తరలించాలని చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments