Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్ : నాకే డబ్బులు ఇవ్వాలంటున్న రాధికా రెడ్డి

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:17 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన శిల్పాచౌదరి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శిల్పా చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు తమ కష్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో రాధికా రెడ్డి అనే మహిళతో పాటు మరో మహిళ పేరును ఆమెను వెల్లడించారు. దీంతో రాధికా రెడ్డి హైదరాబాద్ నగర పోలీసులకు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా చౌదరే తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. 
 
అసలు శిల్పా చౌదరి ఎంత మందిని ఈ విధంగా మోసం చేసిందన్న విషయంపై ఆరా తీసేందుకు పోలీసులు మరోమారు కష్టలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సోమవారం ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశా ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, శిల్పాచౌదరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తొలుత కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ వచ్చిన ఆమె.. ఆ పార్టీలకు వచ్చే అనేక మంది సినీ సెలబ్రీటలకు అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయలను అప్పుగా తీసుకున్నారు. 
 
కానీ, వారికి వడ్డీ చెల్లించలేదు కదా అసలు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దివ్యారెడ్డి అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో హీరో మహేష్ బాబు సోదరి ప్రియదర్శిని కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments