Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాటరింగ్ సర్వీస్ పేరుతో వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు

క్యాటరింగ్ సర్వీస్ పేరుతో వ్యభిచారం.. ముగ్గురి అరెస్టు
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:43 IST)
హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్‌లో క్యాటరింగ్ సర్వీస్ పేరుతో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యభిచార కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
స్థానిక సీఐ మహేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. అంబర్‌పేట, పటేల్ నగర్‌కు చెందిన నస్రీన్ బేగం (35) అనే మహిళ కేటరింగ్ సర్వీస్ నిర్వహిస్తుంది. ఈమె కేటీఆర్ కమాన్ సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. 
 
దీంతో ఆ ఇంటికి విటుల రూపంలో పోలీసులు వెళ్లి ఈ వ్యభిచార తంతును బహిర్గతం చేశారు. ఈ కేసులో నిర్వాహకురాలు నస్రీన్ బేగంతో పాటు.. ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేడెక్కుతున్న కుండ దగ్గర నాగుపాము.. వెచ్చదనం కోసం అలా వచ్చింది