Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేడెక్కుతున్న కుండ దగ్గర నాగుపాము.. వెచ్చదనం కోసం అలా వచ్చింది

వేడెక్కుతున్న కుండ దగ్గర నాగుపాము.. వెచ్చదనం కోసం అలా వచ్చింది
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:24 IST)
snake
అసలే చలికాలం. జనాలు కాదు మూగజీవులు కూడా చలికి వణికిపోతున్నాయి. మూగ జీవులు కూడా వెచ్చదనం కోరుకుంటున్నాయి. తాజాగా అహ్మదాబాద్‌లో ఓ నాగుపాము చలికి వణికిపోతూ.. వెచ్చదనం కోసం వార్మింగ్ పాట్ వద్ద చేరుకుంది. అక్కడే చాలాసేపు గడిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే..  అహ్మదాబాద్‌లో కంకారియా జూ వద్ద ఒక ఎన్ క్లోజర్ వద్ద వేడెక్కుతున్న కుండ దగ్గర నాగుపాము వెచ్చదనాన్ని తీసుకుంటుంది. ఆ ఇంటి యజమాని దాన్ని చూసి షాకయ్యాడు. అతను సహాయం కోసం జంతు రక్షకులను పిలవడానికి పరుగులు తీశాడు. 
 
పామును అక్కడ నుంచి పారద్రోలడానికి ముందు అటవీ శాఖాధికారులు దోమల పిచికారీ చేశారు. కానీ నాగుపాము కదలదు. చివరికి, రెస్క్యూ బృందం భారీ మట్టి జాడీని పక్కకు ఎత్తాలని నిర్ణయించుకుంది, ఇది పామును బలవంతంగా బయటకు నెట్టింది. 
webdunia
snake
 
విషపూరిత పాము నుండి సురక్షితంగా ఉండటానికి రక్షకులు భారీ జాడీలలో ఒకదానిపై నిలబడి పొడవైన స్తంభాన్ని ఉపయోగించి దానిని పిన్ చేశారు. ఇంకా దానిని ఒక గోనె సంచిలోపల బంధించి సురక్షితంగా తీసుకెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌కు కీలక పదవి