మా అమ్మకు సారీ చెప్తేనే ఇంటికి వస్తానన్న భర్త... ఆత్మహత్య చేసుకున్న భార్య

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (15:24 IST)
తన అమ్మను క్షమాపణలు కోరితేనే ఇంటికి వస్తానని భర్త భీష్మించి కూర్చోవడంతో మనస్తాపం చెందిన ఇల్లాలు ఇంట్లోనే ఉరేసుకున ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సూరారం ఆర్జేకే కాలనీకి చెందిన ఎస్కే ఫర్జానా (35), ఎక్సే ఖదీర్ వలీ అనే దంపతులు ఉన్నారు. వీరికి 2011లో వివాహమైంది. అయితే, మద్యానికి బానిస అయిన ఖదీర్ వలీ.. గత కొంతకాలంగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో భార్యాభర్త మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కుమార్తెకు స్కూలు ఫీజు చెల్లించే విషయంపై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త ఖదీర్ వలీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత భర్తకు ఫర్జానా వీడియో కాల్ చేసి ఎక్కడ ఉన్నప్పటికీ ఇంటికి రావాలంటూ ప్రాధేయపడింది. అయితే, తన తల్లికి సారీ చెప్తేనే తాను వస్తానన తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన ఫర్జానా ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దంపతులకు గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments