Webdunia - Bharat's app for daily news and videos

Install App

వట్టినాగులపల్లిలో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:46 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో దారుణం జరిగింది. అర్థరాత్రి ప్రియురాలి బెడ్రూంలోకి చొరబడిన ప్రియుడు కత్తితో గొంతు కోశాడు. గంజాయి మత్తులో ప్రేమ్ సింగ్ ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జీడిమెట్లకు చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్‌బీలోని ఎంఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న గొడీల రూఖీ సింగ్ (21) అనే బంధువు యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. 
 
ఈ క్రమంలో వట్టినాగులపల్లికి చేరుకున్న ప్రేమ్ సింగ్ బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో యువతి బెడ్ రూమ్ తలుపు తన్ని లోనికి చొరబడ్డాడు. కత్తితో యువతి గొంతు కోయడానికి ప్రయత్నించగా అప్పటికే అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. 
 
కుటుంబ సభ్యులు లేచి యువకుడిని పట్టుకుని చితకబాది బంధించారు. యువతికి గొంతు, అరచేయి, కాలు, మణికట్టు వద్ద కత్తి గాయాలయ్యాయి. ఆ వెంటనే ఆ యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments