Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదు ఓయో రూమ్‌లో ప్రియురాలి గొంతులో కత్తి, దింపింది ఎవరు?

Advertiesment
హైదరాబాదు ఓయో రూమ్‌లో ప్రియురాలి గొంతులో కత్తి, దింపింది ఎవరు?
, బుధవారం, 27 అక్టోబరు 2021 (13:11 IST)
హైదరాబాదు నగరంలోని చందానగర్ ఓయో హోటల్ గదిలో ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు విగతజీవిగా పడి వుంది. ఆమె గొంతులో కత్తి దించి వుంది. ఆమెను ప్రియుడే హత్య చేసి వుంటాడని పోలీసులు అనుమానించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 
దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మృతురాలి పేరు నాగచైతన్య. ఈమె వయసు 24 ఏళ్లు. ప్రకాశం జిల్లా కరవదికి చెందిన ఈమె గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డిని ప్రేమించింది. ఇతడు మెడికల్ రిప్రజెంటేటివ్. ఆసుపత్రిలో పనిచేస్తున్న నాగచైతన్యకు ఇతడితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

 
కానీ పెద్దలు అందుకు అంగీకరించలేదు. దీనితో ఈ నెల 23వ తేదీ నల్లగండ్లలోని ఓయో హోటల్ గదిని అద్దెకి తీసుకున్నారు. గదిలోకి వెళ్లాక మరుసటి రోజు వరకూ ఎవరూ బయటకు రావకపోవడంతో ఓయో సిబ్బంది గది తలుపులను బలవంతంగా తెరిచి చూసారు. అక్కడ నాగచైతన్య గొంతులో కత్తి దించినట్లు గాయాలు కనబడ్డాయి. ఆమె చనిపోయి కనబడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు.

 
నాగచైతన్యను ఆమె ప్రియుడే హత్య చేసి వుంటాడని అతడి కోసం గాలించగా మంగళవారం నాడు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఐతే అతడు ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు షాక్ తిన్నారు.

 
తామిద్దరం ఆత్మహత్య చేసుకుందామని హోటలికి వెళ్లామనీ, ఈ క్రమంలో తన ప్రియురాలు తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతులో పొడుచుకున్నదని చెప్పాడు. ఐతే పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆమెను బలవంతంగా ఎవరో పొడిచినట్లు వచ్చింది. దీనితో ఈ కేసు పోలీసలకి సవాలుగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారికి తమిళ భక్తుడు రూ. 1.83 కోట్ల బంగారు బిస్కెట్లు