Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (17:21 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఒక బ్యూటీషియన్ హోటల్ గదిలో ప్రాణాలు తీసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఆత్మహత్య కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. అనూష (26) అనే బ్యూటీషియన్‌కు కట్టుకున్న భర్తతో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి బీహెచ్ఈఎల్ సమీపంలోని తల్లిదండ్రులతో కలిసివుంటుంది. ఆదివారం స్నేహితుల వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అనూష తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. 
 
ఈ క్రమంలో సోమవారం ఓ హోటల్ గదిలో ఆమె అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్టు గుర్తించారు. అయితే, అనూష స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆమె ఉన్న హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అనూష మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
 
ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు... 
 
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్‌లో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసును మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియుడుతో హత్య చేయించిందో వివాహిత. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గ్రామీణ మండలం అక్కంపల్లి - రాచానపల్లి రోడ్డులో చోటుచేసుకుంది. 
 
పోలీసుల కథనం మేరకు.. అక్కంపల్లిలో చిన్న హోటల్ నిర్వహిస్తున్న సురేశ్ బాబు అనే వ్యక్తి హత్య ఘటన వెలుగులోకి వచ్చిన కేవలం ఆరు గంటల్లో ఈ కేసును ఛేదించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సురేశ్ భార్య, ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందాలను ఎస్పీ ఏర్పాటుచేశారు.
 
సురేశ్ చంపాలని అతడి భార్య అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్‌ను ఉసిగొల్పడంతో ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి హోటల్ మూసి ఇంటికి వస్తున్న ఫక్రుద్దీన్‌ను అనిత ప్రియుడు పెద్ద బండరాయితో తలపై కొట్టడం వల్లే సురేష్ చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్య జరిగిన కేవలం ఆరు గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

Havish: రోజూకో సినిమా రిలీజ్ చేయాలనికి నేను రెడీ అంటున్న హీరో హవీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments