Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ది హౌస్ ఆఫ్ రేర్ బంజారాహిల్స్ లో కొత్త ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ సిద్ధమైంది

Advertiesment
The House of Rare New Flagship Store,  Banjara Hills

దేవీ

, బుధవారం, 25 జూన్ 2025 (16:17 IST)
The House of Rare New Flagship Store, Banjara Hills
హైదరాబాద్, జూన్ 2025: భారతదేశ ఫ్యాషన్ రంగంలో వినూత్న దిశగా ప్రయాణిస్తున్న “ది హౌస్ ఆఫ్ రేర్” కంపెనీ, హైదరాబాద్‌లోని ప్రీమియం ఏరియాగా గుర్తింపు పొందిన బంజారాహిల్స్‌లో తన తాజా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తమ రిటైల్ వ్యాప్తిని విస్తరించేందుకు ఇది ఒక కీలక ముందడుగు.
 
ఇదివరకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తొలి ఔట్‌లెట్‌ ప్రారంభించిన ఈ బ్రాండ్, ఇప్పుడు బంజారాహిల్స్‌లో 10,500 స్క్వేర్‌ఫీట్ల విస్తీర్ణంలో, నాలుగు అంతస్తుల భవనంలో షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది.
 
ఈ స్టోర్‌లో సంస్థకి చెందిన నాలుగు విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి: * రేర్ రాబిట్ – ఆధునిక పురుషులకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రెసివ్ మెన్స్వేర్,  *రేరిజం – ప్రస్తుత తరం మహిళల కోసం రూపొందించిన స్టైలిష్ ఉమెన్స్వేర్,   రేర్ వన్స్ – 6-16 ఏళ్ల బాలుర కోసం ప్రత్యేకమైన ఫ్యాషన్,  రేర్’జ్ బై రేర్ రాబిట్ – స్ట్రీట్‌వేర్ మరియు ఫుట్‌వేర్‌కు ఆధునిక రూపం
ఈ స్టోర్ ప్రారంభంతో పాటు 2025 స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్‌ను కూడా ఆవిష్కరించారు, ఇందులో లీనెన్ డిజైన్లు, స్టైలిష్ సిల్హౌఎట్లతో పాటు దక్షిణ భారత వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన ఓపెన్ ఫుట్‌వేర్ లైనప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
 
ఈ సందర్భంగా సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ లావిష్ సోనీ మాట్లాడుతూ, “హైదరాబాద్‌లొ ఫ్యాషన్, క్రాఫ్ట్‌ మరియు కల్చర్‌కు ఉన్న గౌరవం మనందరికీ తెలుసు. మా బంజారాహిల్స్ స్టోర్‌లో కుటుంబం అంతా కలిసి షాపింగ్ చేసుకునేలా ఓ మల్టీ బ్రాండ్ అనుభూతిని మేము అందిస్తున్నాం. ఇది ఓ షాపింగ్ ప్లేస్ మాత్రమే కాదు, ఫ్యాషన్ అనుభవాన్ని పంచే ప్రత్యేక ప్లాట్‌ఫాం.” అన్నారు.
ఈ స్టోర్‌ ఆర్కిటెక్చర్, ఆర్ట్‌ మరియు ఫ్యాషన్‌ మేళవింపుతో భవిష్యత్తుకు తగ్గదిగా నిర్మించబడింది.
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా 170కిపైగా స్టోర్లు కలిగి ఉన్న “ది హౌస్ ఆఫ్ రేర్”, త్వరలో టియర్ 2, టియర్ 3 నగరాల్లోనూ విస్తరణ చేపట్టనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహానికి ఒక రోజు ముందు రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి.. ఎక్కడ?