Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Advertiesment
Ramyasri

దేవీ

, మంగళవారం, 24 జూన్ 2025 (18:49 IST)
Ramyasri
నటి రమ్యశ్రీ పై కొందరు రెండురోజులనాడు భూ బకాసులు దాడి చేశారు. హైదరాబాద్ సమీపంలో 2008 లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ద్వారా కొంత స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆమెతోపాటు మరికొందరు కూడా కొనుగోలు చేశారు. వారంతా కొడుకులు కష్టపడితేనే మేం గతంలో కొనుగోలు చేశాం. కానీ వాటిని సంజయ్ ఖాన్, శ్రీధర్ రావు అనే రియల్టర్ లు తమ భూమిగా కబ్జాచేశారు. దీనిపై ప్రభుత్వానికి విన్నవించారు. హైడ్రా కు కూడా వివరించారు. దీనిపై హైడ్రా కమీషనర్ మాతో మీటింగ్ వేశారు. కానీ ఆరోజు శ్రీదర్ రావు అనే వ్యక్తి రాలేదు.
 
ఆయన తరపున లాయర్ వచ్చాడు. హైడ్రా కమీషనర్ చర్చ పెట్టినప్పుడు లాయర్ చెప్పినవన్నీ అబద్దాలే. ఇంక దేశంలో న్యాయం ఎందుకు జరగడంలేదో నాకు అర్థమయింది. ఆ తర్వాత హైడ్రా కమీషనర్ కొలతలువేసి మార్క్ పెట్టారు. వాటిని చూసి తిరిగి వస్తుండగా ఇద్దరు బైక్ పై కత్తులతో నాపై, నా సోదరుడు రమేష్ ప్రకాష్ పై దాడిచేశారని ఆ టైంలో నేనూ పక్కనే వున్నాను. మరో వ్యక్తి కారుతో నన్ను యాక్సిడెంట్ చేశారు. త్రుటిలో తప్పుకున్నా. కాగా, దాడిచేసి వారిలో కారులో వున్నవాడు మాతోపాటు గతంలో స్థలం తీసుకుని మా బాధితుడుగా యాక్ట్ చేశాడు. ఇదంతా సినిమాలో జరిగినట్లుగా  ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ దేశంలో సామాన్యులకు న్యాయం జరగదా అంటూ ఓ యూట్యూబ్ చానల్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మా సోదరుడు ఆసుప్రతిలో వున్నాడు. అప్పుడు పోలీసులు వచ్చారు.
 
ఆ తర్వాత పోలీసు స్టేషన్ లో కేసుపెట్టడండని కానిస్టేబుల్ కోరిక మేరకు ఎస్.ఐ.శ్రీనాథ్ కి విన్నవించాను. పోలీసులు కూడా నేను చెప్పింది కరెక్టే అంటూ ఎస్.ఐ.కి చెప్పారు.ఆ తర్వాత వారిని వెళ్లిపోమని, మాతో చాలా కేర్ లెస్ గా మాట్లాడారు. దాంతో మాకు న్యాయం జరగదని తేలిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ను కూడా అతను కొనేశాడు. ప్రజాస్వామ్యంలో న్యాయం జరగదు అని అర్థం అయింది. ఇలాంటి వారికి నయూమ్ కు వేసిన శిక్షను వేయాలంటూ కఠినంగా చెప్పింది. మరి తెలంగాణ ప్రభుత్వం వీరికి న్యాయం చేస్తుందో లేదో చూడాలి.

కాగా, రమ్యశ్రీ ఫోన్ ను కూడా ఎస్.ఐ. శ్రీనాథ్ ఆధ్వర్యంలో లాగేసుకుని కోడ్ ను కూడా బలంతంగా అడిగి తీసుకున్నారు. దానితో సినీ పరిశ్రమలోని వ్యక్తులకు తెలియలేదనీ, అందుకే మీడియా ముందుకు వచ్చానని క్లారిటీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్