Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌహతిలో హైదరాబాద్ యువతిపై అత్యాచారం

Webdunia
గురువారం, 28 జులై 2022 (13:08 IST)
గౌహతిలో హైదరాబాద్ నగరంలో యువతి అత్యాచారానికి గురైంది. బాధితురాలు గౌహతిలో నివసిస్తూ ఉండగా అత్యాచారాని
కి గురైంది. ఈ యువతిపై పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉత్తరాది మూలాలు ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని, వారికి సమాచారం అందించామని, గౌహతికి వారు బయలుదేరారని ఇక్కడి పోలీసులు తెలిపారు. 
 
గౌహతిలోని బరాలుముఖ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు మంగళవారం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితుడి ఇంటికి వెళ్లిన పోలీసులకు అతని ఆచూకీ లభించలేదు. నిందితుడు హర్యానాకు చెందిన సుధీర్ చౌదరిగా గుర్తించారు. ఈయన ఒక సంగీత కళాకారుడని, తన తండ్రితో కలిసి గౌహతిలో నివసిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
స్థానికంగా ఉండే ఓ యోగా కేంద్రంలో బాధితురాలితో నిందితుడికి పరిచయం ఏర్పడింది. రెండు నెలలుగా ఇద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ కొద్దికాలంలో నిందితుడి ఇంటిని బాధితురాలు నాలుగైదుసార్లు సందర్శించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుధీర్‌ చౌదరి తనను నాలుగు రోజులుగా ఒక గదిలో బంధించి పలుమార్లు అత్యాచారం చేయడంతో పాటు హత్య చేసేందుకు ప్రణాళిక వేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
తాను కిటికీ తలుపు బద్దలుకొట్టి తప్పించుకొని వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. బాధితురాలు ఇక్కడి హటిగావ్‌లోని ఓ పేయింగ్‌ గెస్ట్‌ వద్ద ఉంటూ ఇంటీరియర్‌ డిజైనర్‌గా సేవలందిస్తోంది. వెదురు కళాకృతుల తయారీలో నిపుణురాలని పోలీసులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments