Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డ చాతిలో పొడిచిన తల్లిదండ్రులు!!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (08:59 IST)
గుడుంబా, గంజాయి మత్తులో అనేక పలు నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు మానవత్వం మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ దంపతులు గుడుంబా మత్తులో కత్తితో కన్నబిడ్డను ఛాతిలో పొడించారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా నన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
మండల కేంద్రంలోని బోయవాడకు చెందిన అబ్బర్ల విజయ్, పద్మ అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు కుమారులు. ఈ దంపతులతో పాటు మరో ఇద్దరు కుమారులు నిత్యం గుడుంబా మత్తులో ఉంటూ పొద్దస్తమానం గొడవలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విజయ్, పద్మలు తమ రెండో కుమారుడు అశోక్‌ను గుడుంబా కోసం డబ్బులు అడగ్గా అతను నిరాకరించాడు. 
 
దీంతో కోపం పెంచుకున్న ఆ దంపతులు.. గుడుంబా తాగి... ఆ మత్తులో ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న పెద్ద కుమారుడు శేఖర్‌ను అశోక్ అనుకుని కొడవలితో ఛాతిపై పొడిచారు. దీంతో తీవ్రంగా గాయపడిన శేఖర్.. మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments